ఆన్‌లైన్‌ ఎఫ్‌ఐఆర్‌ సాధ్యమేనా?

Home Ministry asks Law Commission - Sakshi

లా కమిషన్‌ను అడిగిన హోంశాఖ

న్యూఢిల్లీ: ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు రాకుండా తమ ఇళ్ల నుంచే కంప్యూటర్ల ద్వారా ఈ–ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయవచ్చా? అని లా కమిషన్‌ను కేంద్ర హోంశాఖ ప్రశ్నించింది. తమకు అందిన సమాచారం కేసు పెట్టదగినదే అయితే పోలీసులు సీఆర్పీసీ సెక్షన్‌ 154 ప్రకారం తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలని 2013లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రాథమిక విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో ఈ–ఎఫ్‌ఐఆర్‌పై అభిప్రాయాన్ని చెప్పాలని లా కమిషన్‌ను హోంశాఖ కోరింది. ప్రజలు పోలీస్‌స్టేషన్‌కు రాకుండా ఇంటి నుంచి ఫిర్యాదు చేయాలంటే సీఆర్పీసీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని కమిషన్‌ సూచించింది. ఈ విధానం తీసుకురావడం వల్ల ప్రజలకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన బాధ తప్పుతుందని వెల్లడించింది. అయితే ఈ సౌకర్యాన్ని కొందరు తప్పుడు అభియోగాలు చేసేందుకు, ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు దుర్వినియోగం చేసే అవకాశముందని హెచ్చరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top