ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు

Heavy Rain in Mumbai - Sakshi

సాక్షి, ముంబై : గత రాత్రి నుంచి భారీ వర్షాలు ముంబై నగరాన్ని ముంచెత్తుతున్నాయి. దీంతో చాలావరకు ముంబైలో రైళ్ల రాకపోకలు నెమ్మదించాయి. పలుచోట్ల రోడ్లమీద నీళ్లు చేరడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. లోతట్టు ప్రాంతాలు చాలావరకు జలమయం అయ్యాయి. ఎంజీ రోడ్డులో చెట్టు కూలి ఇద్దరు మృతిచెందారు. ఐదుగురికి గాయాలయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ముంబై మున్సిపాలిటీ సిబ్బంది రంగంలోకి దిగింది. పలుచోట్ల భారీ పంపులతో నీటిని తోడుతున్నారు.

చెంబూరు ప్రాంతంలో భారీగా నీళ్లు వచ్చిచేరడంతో స్థానికులు మోకాళ్లలోతు నీళ్లలో కష్టాలు పడుతూ ముందుకు సాగడం కనిపించింది. వర్షం కురుస్తుండటంతో చాలా ప్రాంతాల్లో జనజీవనం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వర్షం  కారణంగా రైళ్లు, విమానాలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షాల కారణంగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top