‘గూగుల్’ సుబ్బలక్ష్మి | Google marks MS Subbulakshmi's 97th birthday with a doodle | Sakshi
Sakshi News home page

‘గూగుల్’ సుబ్బలక్ష్మి

Sep 17 2013 3:39 AM | Updated on Sep 1 2017 10:46 PM

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి గూగుల్ సంస్థ అరుదైన గౌరవాన్ని చ్చింది. ఆమె 97వ జయంతి సందర్భంగా సోమవారం గూగుల్ ‘డూడుల్(గూగుల్ వెబ్‌సైట్ హోంపేజీ లో వచ్చే లోగో)’గా సుబ్బలక్ష్మి చిత్రాన్ని పెట్టింది.

న్యూఢిల్లీ: ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి గూగుల్ సంస్థ అరుదైన గౌరవాన్ని చ్చింది. ఆమె 97వ జయంతి సందర్భంగా సోమవారం గూగుల్ ‘డూడుల్(గూగుల్ వెబ్‌సైట్ హోంపేజీ లో వచ్చే లోగో)’గా సుబ్బలక్ష్మి చిత్రాన్ని పెట్టింది. నుదుటిపై ఎరుపు, నలుపు బొట్టుతో.. చేతిలో తంబురా పట్టుకొని కూర్చున్న సుబ్బలక్ష్మి,  పక్కన తబలా, మృదంగం వంటి వాయిద్యాలను చిత్రంలో ఉంచారు. సుబ్బలక్ష్మి 1916 సెప్టెంబర్ 16న తమిళనాడులోని మదురైలో జన్మించారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్ సహా ఎన్నో ఉన్నత సత్కారాలను సుబ్బలక్ష్మి పొందారు. 1996లో ప్రభుత్వం ఆమెను ‘భారత రత్న’తో గౌరవించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement