ఆవుకు జాతీయ జంతువు హోదా! | Give national animal status to cow: Jamiat Ulema-i-Hind chief | Sakshi
Sakshi News home page

ఆవుకు జాతీయ జంతువు హోదా!

May 11 2017 12:51 AM | Updated on Sep 5 2017 10:51 AM

ఆవుకు జాతీయ జంతువు హోదా!

ఆవుకు జాతీయ జంతువు హోదా!

ఆవుకు జాతీయ జంతు వు హోదా ఇవ్వడంపై ఆలోచన చేయాలని జమైత్‌ ఉలేమా–ఐ– హింద్‌ అధ్యక్షుడు మౌలానా సయ్యద్‌ అర్షద్‌ మదాని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

తాము మద్దతిస్తామన్న జమైత్‌ ఉలేమా–ఐ–హింద్‌ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: ఆవుకు జాతీయ జంతు వు హోదా ఇవ్వడంపై ఆలోచన చేయాలని జమైత్‌ ఉలేమా–ఐ– హింద్‌ అధ్యక్షుడు మౌలానా సయ్యద్‌ అర్షద్‌ మదాని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ ప్రతిపాదనకు తాము మద్దతిస్తామని ప్రకటిం చారు. దేశంలోని ఇస్లామిక్‌ మేధావులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యంత ప్రభావవం తమైన సంస్థకు అధిపతి అయిన ఆయన బుధవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడు తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంత రించుకున్నాయి.

గోసంరక్షకుల పేరిట కొనసాగుతున్న హింస నేపథ్యంలో ‘భయపూరిత వాతావ రణం’ నెలకొనడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మతాన్ని అడ్డుపెట్టుకుని గోసంరక్షకులు దాడులకు, హత్యలకు పాల్పడుతున్నారని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని చెప్పారు. హిందువుల మతవిశ్వాసాల్ని తాము గౌరవిస్తామని, అయితే ఏ ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు అనుమతించరాదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement