భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం | Explosives seized in Meghalaya | Sakshi
Sakshi News home page

భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం

Aug 1 2016 7:10 PM | Updated on Sep 4 2017 7:22 AM

మేఘాలయలో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

గోల్పారా: మేఘాలయలో పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన సోదాల్లో గోల్పారా జిల్లాలోని ఓ గ్రామంలో ఇవి పోలీసుల కంటపడ్డాయి.

ఇటీవల పోలీసులకు పట్టుబడిన ఉల్ఫా కేడర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు చెప్పిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా ఇవి లభించినట్లు పోలీసులు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం 52 జిలెటిన్స్, 182 డిటోనేటర్స్, కొన్ని మీటర్ల ఫ్యూజ్ వైరు లభించింది. ఇటీవల ఉల్ఫాకు చెందిన లాంబు అసోం, హరినాథ్ రభా పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. వీరిని విచారించగా ఈ బాంబుల వివరాలు తెలిశాయి.

Advertisement
 
Advertisement
Advertisement