కనికరం లేని మాజీ సైనికుడు.. వీడియో వైరల్‌ | ex army man kills pet dog in punjab, video viral  | Sakshi
Sakshi News home page

కనికరం లేని మాజీ సైనికుడు.. వీడియో వైరల్‌

Dec 9 2017 2:16 PM | Updated on Sep 2 2018 3:30 PM

ex army man kills pet dog in punjab, video viral  - Sakshi

సాక్షి, బర్నాలా: ఓ మాజీ సైనికుడు తుపాకితో తన పెంపుడు కుక్కను కట్టేసి కాల్చి చంపాడు. ఈ ఘటన పంజాబ్‌లోని బర్నాలా జిల్లా బాద్బార్‌ గ్రామంలో చోటుచేసుకుంది. అజిత్‌ సింగ్‌ మాజీ సైనికుడు. బాద్బార్‌ తన సొంత గ్రామం. అజిత్‌ సింగ్‌ తన మిత్రుడు సత్వీర్‌ సింగ్‌తో కలిసి రోడ్డుపైన అందరూ చూస్తుండగానే కుక్కను కాల్చి దారుణంగా హతమార్చాడు. ఆ సైనికుడి కుమారుడు ఆ సన్నివేశాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం  ఆ వీడియో వైరల్‌ అయ్యింది.

ఆ వీడియోను చూసిన జంతు ప్రేమికులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. దీనిపై స్పందించిన జంతు హక్కుల సంస్థ.. వారిపై చర్యలను తీసుకోవాలని కేంద్రమంత్రి మనేకా గాంధీ, పంజాబ్‌ డీజీపీలకు లేఖ రాశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిపై జంతు హింస కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

బైల్‌పై బయటకు వచ్చిన మాజీ సైనికుడు అజిత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. నా పెంపుడు కుక్కకు ర్యాబీస్‌ వ్యాధి సోకింది.. ఈ కుక్క తన రెండు గేదెలను, చాలా మంది ప్రజలను కరిచింది అందుకే చంపానని ఆయన పోలీసులకు తెలిపారు. చాలా ప్రేమతో ఆ కుక్కను నేను పెంచుకున్నాను. అలాంటిది నేనే ఎందుకు చంపుకుంటానని మాజీ సైనికుడు చెప్పారు. కుక్క అవయావాలను టెస్టు నిమిత్తం డాక్టర్‌ ల్యాబ్‌కు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement