గుర్తింపులేని పార్టీలకు ఈసీ ఊరట | ec statement to un recognised parties | Sakshi
Sakshi News home page

గుర్తింపులేని పార్టీలకు ఈసీ ఊరట

Jul 1 2015 8:04 AM | Updated on Aug 14 2018 4:34 PM

ఎన్నికల సంఘం (ఈసీ) వద్ద నమోదైనా, గుర్తింపు పొందని పార్టీలకు పెద్ద ఊరట లభించింది.

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం (ఈసీ) వద్ద నమోదైనా, గుర్తింపు పొందని పార్టీలకు పెద్ద ఊరట లభించింది. ఇక నుంచి ఈ పార్టీల అభ్యర్థులు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఏకీకృత గుర్తు (కామన్ సింబల్)ను కేటాయించేందుకు ఈసీ అంగీకరిస్తూ గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆరేళ్ల క్రితం నమోదైన పార్టీలకు మాత్రం ఈ సౌలభ్యం ఉంటుందని వివరించింది.

ఇందుకు కొన్ని షరతులను కూడా విధించింది. అసెంబ్లీ ఎన్నికలకు అయితే.. మొత్తం నియోజకవర్గాల్లో కనీసం ఐదుశాతం స్థానాల్లో అభ్యర్థులును నిలబెట్టాలి. లోక్‌సభ ఎన్నికలకు అయితే కనీసం ఇద్దరిని నిలబెట్టాలి. ఈసీ కేటాయించే పది గుర్తుల్లో ఏదో ఒక దానిని ఎంచుకోవచ్చు. పార్టీ కూడా తనకు నచ్చిన మూడు గుర్తులను సూచించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement