
ఏడేళ్లలో తొలిసారి తగ్గనున్న డీజిల్ ధర!
ప్రతినెలా లీటరుకు 50 పైసల చొప్పున పెరుగుతున్న డీజిల్ ధర ఏడేళ్ల చరిత్రలో తొలిసారిగా తగ్గే అవకాశముంది. పెట్రోల్ కూడా రూపాయి తగ్గొచ్చు.
పెట్రోల్‌పైనా రూపాయి తగ్గే అవకాశం
న్యూఢిల్లీ: ప్రతినెలా లీటరుకు 50 పైసల చొప్పున పెరుగుతున్న డీజిల్ ధర ఏడేళ్ల చరిత్రలో తొలిసారిగా తగ్గే అవకాశముంది. పెట్రోల్ కూడా రూపాయి తగ్గొచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ముడిచమురు ధర 15 నెలల్లో తొలిసారి వందడాలర్ల దిగువకు చేరుకోవడం, రూపాయి మారకం విలువ బలపడడంతో ఇందుకు మార్గం సుగమమైంది. పెట్రోల్, డీజిల్ ధరలను ఈ నెల 15న సవరించాల్సి ఉందని, అప్పటివరకు ముడిచమురు ధర బ్యారెల్‌కు వంద డాలర్లలోపు కొనసాగితే వీటి ధరలను తగ్గించే అవకాశముందని ఓ అధికారి చెప్పారు. పెట్రోల్ ధర తగ్గితే అది గత నెల నుంచి నాలుగో తగ్గింపవుతుంది.