జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్తత

Delhi Police Detain JNU Students Protest At Rashtrapati Bhavan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలోని జేఎన్‌యూలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొన్నటి హింసాత్మక ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసేందుకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. వారు ప్రతిఘటించడంతో పోలీసులు-విద్యార్థుల మధ్య ఘర్ణణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థినిలు తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమందిని బలవంతంగా అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రాష్ట్రపతి భవన్‌ రోడ్డు మార్గంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

అయితే వర్సిటీ వీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తొలుత జేఎన్‌యూ విద్యార్థులు హెఆర్‌డీ అధికారులను కలిసేందుకు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. వీరికి మద్దతుగా విపక్ష నేతలు, సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కారత్‌, బృందా కారత్‌, శరద్‌ యాదవ్‌లు కూడా  ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అయితే అక్కడ హెఆర్‌డీ అధికారులను కలిసిన  అనంతరం.. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లాలని విద్యార్థులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ర్యాలీగా వెళ్తున్న వారిని మధ్యలోనే పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. దీంతో మరోసారి జేఎన్‌యూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top