నేడు ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికలు | Delhi municipal elections today | Sakshi
Sakshi News home page

నేడు ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికలు

Apr 23 2017 1:38 AM | Updated on Mar 29 2019 9:31 PM

దేశ రాజధాని ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. 1.3 కోట్ల మంది ఓటర్లు 272 మంది కౌన్సిలర్లను ఎన్నుకోనున్నారు. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ప్రజా తీర్పు రాజధాని రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన ఆప్‌కు ప్రజల్లో ఇంకా పట్టుందో లేదో, పదేళ్లుగా మునిసిపల్‌ కార్పొరేషన్‌ను ఏలుతున్న బీజేపీ హవా తగ్గిందో లేదో ఎన్నికలు తేల్చనున్నాయి.

కాగా, బీజేపీకి ఓటేసి మీ పిల్లల జీవితాలను ప్రమాదంలో పడేయవద్దని సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే పిల్లలకు డెంగీ, చికున్‌గున్యా వ్యాధులు వస్తాయని, అందుకు మీరే బాధ్యులవుతారని అన్నారు. మరోపక్క.. నిబంధనలకు విరుద్ధంగా ఒపీనియన్‌ పోల్స్‌ ఫలితాలను ప్రకటించిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, టైమ్స్‌ నౌ మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement