ఢిల్లీ మంత్రుల శాఖలు ఇవే!

Delhi Cabinet Portfolios Allocated: Manish Sisodia Gets Finance - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిగా మూడో పర్యాయం హస్తిన పీఠం ఎక్కిన అరవింద్‌ కేజ్రీవాల్‌ తన కేబినెట్‌లోని ఆరుగురు మంత్రులకు శాఖలను కేటాయించినట్టు తెలుస్తోంది. తాను మాత్రం ఎటువంటి శాఖ తీసుకోలేదని సమాచారం. గత మంత్రివర్గంలో సమర్థవంతంగా పనిచేసి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కీలక భూమిక​ పోషించిన మనీశ్‌ సిసోడియా, సత్యేందర్‌ జైన్, కైలాస్‌ గహ్లోత్, గోపాల్‌ రాయ్, రాజేంద్ర పాల్‌ గౌతమ్, ఇమ్రాన్‌ హుస్సేన్‌లకు మళ్లీ కేబినెట్‌ పదవులు దక్కాయి. గత కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మనీశ్‌ సిసోడియా.. విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈసారి ఆయనకు ఆర్థిక, ప్రణాళిక వ్యవహారాల శాఖ కేటాయించినట్టు ‘ఏఎన్‌ఐ’ వార్తా సంస్థ వెల్లడించింది.

మంత్రులు- వారికి కేటాయించిన శాఖలు

1. మనీశ్‌ సిసోడియా: ఆర్థిక, ప్రణాళిక, పర్యాటకం, భూమి-భవనాలు, విజిలెన్స్‌, సర్వీసెస్‌, కళలు, సంస్కృతి, భాషలు

2. ఇమ్రాన్‌ హుస్సేన్‌: అడవులు, ఆహార సరఫరా, ఎన్నికలు

3. కైలాస్‌ గహ్లోత్: రవాణా, రెవెన్యూ, న్యాయ, శాసన వ్యవహారాలు, ఐటీ, కార్యనిర్వాహక సంస్కరణలు

4. గోపాల్‌ రాయ్‌: పర్యావరణం

5. రాజేంద్ర పాల్‌ గౌతమ్: మహిళా, శిశు సంక్షేమం

6. సత్యేందర్‌ జైన్: ఢిల్లీ జల్‌ బోర్డు (డీజేబీ)

చదవండి: మోదీ ఆశీస్సులు కావాలంటున్న కేజ్రీవాల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top