రాఫెల్‌ డీల్‌ : రాహుల్‌ ఆరోపణలు తోసిపుచ్చిన దసాల్ట్‌ | Dassault Aviation CEO Eric Trappier Rrubbishes Charges Levelled By Rahul Gandhi | Sakshi
Sakshi News home page

రాఫెల్‌ డీల్‌ : రాహుల్‌ ఆరోపణలు తోసిపుచ్చిన దసాల్ట్‌

Nov 13 2018 12:41 PM | Updated on Nov 13 2018 12:42 PM

Dassault Aviation CEO Eric Trappier Rrubbishes Charges Levelled By Rahul Gandhi - Sakshi

దసాల్ట్‌ ఏవిమేషన్‌

సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను దసాల్ట్‌ ఏవియేషన్‌ సీఈవో ఎరిక్‌ తపిర్‌ తోసిపుచ్చారు. కాంగ్రెస్‌ ఆరోపణలను ప్రస్తావించిన ఆయన తాను అసత్యాలు ఏమీ చెప్పలేదని అన్నారు.ఎరిక్‌ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను రాఫెల్‌ డీల్‌ గురించి అసత్యాలు వెల్లడించలేదని, తాను ఇచ్చిన స్టేట్‌మెంట్లు వాస్తవమని, అబద్ధాలు చెప్పే అలవాటు తనకులేదని చెప్పుకొచ్చారు. దివంగత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలో 1953లో భారత్‌- ఫ్రాన్స్‌ మధ్య జరిగిన తొలి ఒప్పందాన్ని గుర్తు చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీతో తమ కంపెనీకి అనుబంధం ఉందని పేర్కొన్నారు.

తాము భారత్‌తో కలిసి పనిచేస్తున్నామని, ఏ పార్టీతో కాదని స్పష్టం చేశారు. భారత వాయుసేనకు, ప్రభుత్వానికి తాము వ్యూహాత్మక ఉత్పత్తులను సరఫరా చేస్తామని, పార్టీలతో సంబంధం లేదని పేర్కొన్నారు. ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంచుకోవడంపై స్పందించారు.

ఈ ఒప్పందం ద్వారా సమకూరే నిధులు నేరుగా రిలయన్స్‌కు వెళ్లబోవని, జాయింట్‌ వెంచర్‌కు చేరతాయని వెల్లడించారు. తొలివిడతగా దసాల్ట్‌ ఏవియేషన్‌ అనిల్‌ అంబానీ కంపెనీకి రూ 284 కోట్లను చెల్లించిందని ఇటీవల రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో దసాల్ట్‌ సీఈవో ఈ మేరకు వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement