స్కూలు పిల్లలకు ఎన్సీఈఆర్టీ క్యాలెండర్‌

COVID-19: NCERT issues alternative academic calendar - Sakshi

న్యూఢిల్లీ: లాక్‌ డౌన్‌లో ఒకటినుంచి 12 తరగతుల విద్యార్థులు సమయం సద్వినియోగం చేసుకునేలా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) ప్రత్యేక క్యాలెండర్‌ విడుదల చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ గురువారం ఈ క్యాలెండర్‌ విడుదల చేశారు. టెక్నలాజికల్‌ టూల్స్, సోషల్‌ మీడియా టూల్స్‌ ఉపయోగించుకొని మరింత పరిజ్ఞానాన్ని పిల్లలకు అందించే విధంగా ఇందులోని కోర్సులు ఉన్నాయని రమేశ్‌చెప్పారు. ఇందులో అధ్యాపకులు బోధించే విషయాలను విద్యార్థులు చూసి నేర్చుకోవచ్చని తెలిపారు.

టెక్నాలజీ అందుబాటులో లేని విద్యార్థుల కోసం ఫోన్‌ కాల్‌ ద్వారా బోధించే విధానం కూడా ఇందులో ఉన్నట్లు వెల్లడించారు. 1 నుంచి 12 తరగతుల వరకు ఉన్న అన్ని విషయాలు ఇందులో ఉంటాయని, అయితే విద్యార్థులు వరుస క్రమంలోనే గాక, తమకు ఆసక్తి ఉన్న అంశాలను ఎన్నుకొని మరీ చూసి నేర్చుకోవచ్చని తెలిపారు. అందులో ఉన్న వరుస క్రమం తప్పనిసరి కాదని అన్నారు. లాక్‌ డౌన్‌ లో విద్యార్థులను సమయం వృధా కానివ్వకుండా, ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల స్కూళ్లు కూడా లబ్ధి పొందుతాయని చెప్పారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top