మరోసారి జాతి ముందుకు ప్రధాని మోదీ | coronavirus: PM Narendra Modi to address nation Tuesday | Sakshi
Sakshi News home page

మరోసారి జాతి ముందుకు ప్రధాని మోదీ

Mar 24 2020 12:01 PM | Updated on Mar 24 2020 12:10 PM

coronavirus: PM Narendra Modi to address nation Tuesday - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. కోవిడ్ -19 (కరోనా వైరస్) విస్తరిస్తున్న వైనం, దేశవ్యాప్తంగా  పలు రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని జాతికి సందేశాన్ని ఇవ్వనున్నారు. కోవిడ్ -19కి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై మార్చి 24 (మంగళవారం) సాయంత్రం 8 గంటలకు ఆయన సందేశాన్ని ఇవ్వనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిపై ముఖ్యమైన విషయాలను పంచుకుంటాను అంటూ ప్రధాని మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. (వైరస్‌పై నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం)

ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటనను సీరియస్ తీసుకోవడం లేదంటూ ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. అందరూ విధిగా లాక్ డౌన్ ఆంక్షలను, సూచనలను తీవ్రంగా పాటించాలని ఆయన ప్రజలను కోరారు, తద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను కాపాడుకోవాలంటూ సోమవారం ట్విటర్ ద్వారా సూచించారు. అలాగే లాక్ డౌన్ ను కచ్చితంగా అమలయ్యే చూడాలని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.  కాగా మంగళవారం  నాటికి దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 500 సమీపానికి చేరింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement