మ్యాగీకి సీఎఫ్‌టీఆర్‌ఐ క్లీన్‌చిట్ | CFTRI clean chit to Maggie | Sakshi
Sakshi News home page

మ్యాగీకి సీఎఫ్‌టీఆర్‌ఐ క్లీన్‌చిట్

Apr 12 2016 2:39 AM | Updated on Oct 8 2018 4:21 PM

మ్యాగీకి సీఎఫ్‌టీఆర్‌ఐ క్లీన్‌చిట్ - Sakshi

మ్యాగీకి సీఎఫ్‌టీఆర్‌ఐ క్లీన్‌చిట్

కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ(సీఎఫ్‌టీఆర్‌ఐ) మ్యాగీ నూడుల్స్‌కు క్లీన్‌చిట్ ఇస్తూ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

న్యూఢిల్లీ:

మ్యాగీ నూడుల్స్ తింటే హానికరం, ఆరోగ్యానికి ప్రమాదకరమంటూ మార్కెట్లో బంద్ చేసిన ఈ ఉత్పత్తులకు కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధన సంస్థ(సీఎఫ్టీఆర్ఐ) నుంచి అన్ని అనుమతులు లభించాయి. ఈ సంస్థ నిర్వహించిన పరిశోధనలో మ్యాగీ నూడుల్స్ మంచి ఫలితాలు వచ్చాయి. దాదాపు 29 శాంపుల్స్ పై నిర్వహించిన టెస్ట్ లో ఎలాంటి హానికరమైన రసాయన పదార్థాలు లేవని సీఎఫ్టీఆర్ఐ సుప్రీంకు తెలపింది.

ఈ విషయాన్ని నెస్లే సోమవారం సాయంత్రంప్రకటించడంతో, మంగళవారం మార్కెట్లో దీన్ని షేర్ విలువ 5 శాతం పెరిగి రూ.6,180 కు చేరింది.. గతేడాది డిసెంబర్ లో మ్యాగీ నూడుల్స్ శాంపుల్స్ ను మైసూర్ ల్యాబోరేటరీలో పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీఎఫ్టీఆర్ఐ నుంచి మ్యాగీకి వచ్చిన మంచి ఫలితాలతో మరిన్ని మ్యాగీ ఉత్పత్తులను మార్కెట్లోకి పునః ప్రవేశపెడతామని నెస్లే తెలిపింది.

2015 జూన్ లో ఫుడ్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఏఐ మ్యాగీ నూడుల్స్ లో హానికరమైన రసాయన పదార్థాలు ఉన్నాయంటూ మార్కెట్లో ఆ ఉత్పత్తును ఆపివేసింది. ముంబాయి హైకోర్టు విధించిన షరతులను సంతృప్తిపరుస్తూ మ్యాగీ నూడుల్స్ గతేడాది నవంబర్ లోనే మళ్లీ మార్కెట్లోకి వచ్చింది. కానీ దాని షేర్ల విలువ ఏ మాత్రం పెరుగలేదు. 14.50 శాతం వరకూ పడిపోయాయి.ఈ క్రమంలో సీఎఫ్టీఆర్ఐ ఇచ్చిన ఫలితాలతో నెస్లే షేర్లు మెరుగైన బాటలో నడుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement