‘అభినందన్‌ వీడియోలను తొలగించిన యూట్యూబ్‌’

Central Government Ordered YouTube to Remove Videos Related Abhinandan - Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ ఆర్మీకి చిక్కిన భారత వైమానిక దళం వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌కు సంబంధించిన వీడియోలను వెంటనే తొలగించాలని యూట్యూబ్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ, సమాచార మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. వింగ్‌ కమాండర్‌కు చెందిన పలు వీడియోల లింక్‌లను తొలగించాలని ఆదేశించింది. పాక్‌ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో మన దేశానికి చెందిన మిగ్‌-21 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పాకిస్తాన్‌ ఆర్మీకి చిక్కిన భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌పై స్థానికులు దాడి చేసిన వీడియో, అనంతరం పాక్‌ ఆర్మీ రిలీజ్‌ చేసిన వీడియోలు అభ్యంతకరంగా ఉన్నాయని కేంద్రం భావించింది. దీనిలో భాగంగానే ఆ వీడియోలను తొలగించాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన యూట్యూబ్‌.. అభినందన్‌కు సంబంధించిన వీడియోలను తొలగించినట్లు, గూగుల్‌ సర్వీసెస్‌ను అప్‌డేట్‌ చేశామని తెలిపింది.

ఇక పాక్‌ చెరలో చిక్కుకున్న అభినందన్‌ రేపు(శుక్రవారం) భారత్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు విక్రమ్‌ అభినందన్‌ను రేపు విడుదల చేస్తామని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. శాంతి చర్యల్లో భాగంగా అభినందన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. అంతకుముందు పలు షరతులతో విడుదల చేస్తామని పాక్‌ ప్రకటించగా.. భారత్‌ తిప్పికొట్టింది. జెనీవా ఒప్పందం ప్రకారం తమ వింగ్‌ కమాండర్‌ను అప్పగించాల్సిందేనని ఒత్తిడి పెంచింది. భారత ఒత్తిడికి తలొగ్గిన పాక్‌ ప్రభుత్వం అభినందన్‌ను విడుదల చేయడానికి అంగీకారం తెలిపింది.
చదవండి: తలొగ్గిన పాక్‌.. రేపు అభినందన్‌ విడుదల

‘అభినందన్‌పై సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ‌’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top