
న్యూ ఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కేంద్రం ఈ అవార్డులను శుక్రవారం సాయంత్రం ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా నలుగురికి పద్మ విభూషణ్, 14 పద్మ భూషణ్, 94 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. పద్మ విభూషణ్ పొందిన వారిలో ఇస్మాయిల్ ఒమర్ గులే, అనిల్‌కుమార్ మణీబాయ్, బల్వంత్ మెరేశ్వర్ పురందరే, టీజెన్ బాయ్‌లు ఉన్నారు. మాళయళ నటుడు మోహన్ లాల్‌ను, ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌లను పద్మ భూషణ్ వరించింది.
పద్మ శ్రీ అవార్డులు పొందిన వారిలో కొందరు...
ద్రోణవల్లి హారిక(చెస్ క్రీడాకారిణి)
సిరివెన్నెల సీతారామశాస్త్రి(గేయ రచయిత)
యెండవల్లి వెంకటేశ్వరరావు(వ్యవసాయ వేత్త)
ప్రభుదేవా(కొరియోగ్రాఫర్)
మనోజ్ బాజ్ పాయ్(నటుడు)
సునీల్ చెత్రీ(పుట్‌బాల్ ప్లేయర్)
గౌతమ్ గంభీర్(క్రికెటర్)
శివమణి(డ్రమ్మర్)