నవంబర్‌ 25న క్యాట్‌ పరీక్ష

Cat test on November 25 - Sakshi

కోల్‌కతా: ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)ల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే క్యాట్‌–2018 పరీక్షను నవంబర్‌ 25న నిర్వహిస్తామని ఐఐఎం కోల్‌కతా తెలిపింది. అభ్యర్థులు వచ్చే నెల 8 నుంచి సెప్టెంబర్‌ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రెండు దశల్లో జరగనున్న ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 147 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు క్యాట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సుమంతా బసు చెప్పారు. అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో 4 పట్టణాలను ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. అక్టోబర్‌ 24 నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని, పరీక్ష ఫార్మట్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు అక్టోబర్‌ 17 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో మోడల్‌ పేపర్లను అందుబాటులోకి ఉంచనున్నట్లు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top