'బీజేపీది ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖం' | BJP Has 'World's Most Beautiful Face', Kiran Bedi's Reply to AAP on PM Modi | Sakshi
Sakshi News home page

'బీజేపీది ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖం'

Jan 19 2015 9:42 AM | Updated on Sep 2 2017 7:55 PM

'బీజేపీది ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖం'

'బీజేపీది ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖం'

భారతీయ జనతాపార్టీది ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖమని మాజీ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ నేత కిరణ బేడీ అభివర్ణించారు.

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీది ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖమని  మాజీ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ నేత కిరణ్ బేడీ అభివర్ణించారు. ఈ మధ్యనే బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆమె .. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖంగా వెలిగిపోతుందని కిరణ్ బేడీ అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో పోటీచేయడానికి బీజేపీకి సరైన ముఖం లేకపోవడంతోనే కిరణ్ బేడీని మోదీ తెరపైకి తీసుకొచ్చారన్న ఆప్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు.'బీజేపీ వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్. నేను నరేంద్ర మోదీ నాయకత్వం పనిచేయడానికే పార్టీలో చేరా. ఆయన నాయకత్వంలో పనిచేసే మేము కేవలం స్టార్స్ మాత్రమే'  అని ఆమె తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement