పశ్చిమబెంగాల్ గవర్నర్ కైలాస్నాథ్ త్రిపాఠి అదనంగా బీహార్ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ గవర్నర్ కైలాస్నాథ్ త్రిపాఠి అదనంగా బీహార్ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. ఆదివారం రాష్ట్రపతి భవన్ ఈ మేరకు ప్రకటించింది.
బీహార్ ప్రస్తుత గవర్నర్ డీవై పాటిల్ పదవీకాలం ఈ నెల 26తో ముగియనుంది. దీంతో కొత్త గవర్నర్ను నియమించేంత వరకు బీహార్ గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కైలాస్నాథ్ను ఆదేశించినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది.