గువాహటి: తమ వద్ద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వేతర పాఠశాలలకు ముక్కుతాడు వేసేందుకు అసోం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
గువాహటి: తమ వద్ద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వేతర పాఠశాలలకు ముక్కుతాడు వేసేందుకు అసోం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేరుగా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదేశాలు జారీచేయగల ప్రత్యేక చట్టాన్ని తీసుకురానుంది. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థులనుంచి అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేయడమే కాకుండా వారికి ఎంతో శ్రమకూర్చి విద్యాబోధన చేసే టీచర్లకు చాలిచాలని జీతభత్యాలు ఇవ్వడం, అవి కూడా సరైన సమయానికి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం, ఒక్కోసారి ఎగవేతలకు పాల్పడటంవంటి చర్యలకు తమ చట్టం ద్వారా స్వస్థి పలకనున్నారు.
ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రశ్నోత్తర సమయంలో అసోం గణ పరిషత్ ఎమ్మెల్యే కేషాబ్ మహంత అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి శరత్ బోర్కోటోకి బదులిచ్చారు.