ఢిల్లీ అల్లర్లు: అసదుద్దీన్‌ ఒవైసీ సభ వాయిదా

Asaduddin Owaisi CAA Rally Put Off In Maharashtra - Sakshi

ముంబై: దేశ రాజధానిలో ఢిల్లీ చోటు చేసుకుంటున్న పౌరసత్వం సవరణ చట్టం( సీఏఏ)  వ్యతిరేక, అనుకూల అల్లర్ల సెగ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సభకు తగిలింది. మహారాష్ట్ర  థానే జిల్లాలోని భీవండిలో స్థానిక ఎంఐఎం నేతలు గురువారం నిర్వహించే సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేక బహిరంగ సభను పోలీసులు రద్దు చేశారు. ఈ సభకు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించాల్సింది. అయితే.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎంఐఎం నేతలు నిర్వహించే ఈ సభను వాయిదా వేయాలని బుధవారం పోలీసులు కోరారు. ఢిల్లీ ఘర్షణలపై స్పందించిన ఆరెస్సెస్‌

ఇ​క ఎంఐఎం నేతలు పోలీసుల అభ్యర్థనకు  సానుకూలంగా స్పందించి తమ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారని డీసీపీ రాజ్‌కుమార్‌ షిండే పేర్కొన్నారు. అదే విధంగా గురువారం సాయంత్రం ముంబైలోని భీవండిలో జరగబోయే ఎంఐఎం బహిరంగ సభ వాయిదా పడిందని ఔరంగాబాద్‌ ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌ తన ట్విటర్‌ ఖాతాలో తెలిపారు. ఈ సభను మార్చి నెల రెండో వారంలొ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. (ఢిల్లీ అల్లర్లు : ఏప్రిల్‌ 13కు విచారణ వాయిదా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top