అప్పుడలా...ఇప్పుడిలా
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీని చూసి అటు బంధువులు, ఇటు స్నేహితులు అశ్చర్యపోతున్నారు.
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీని చూసి అటు బంధువులు, ఇటు స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు. ఎలా ఉండే అనంత్ ఎలా మారాడో అని వారంతా అనుకుంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ల సందర్భంగా తమ ముంబై జట్టుతో సందడి చేసిన అనంత్ ... భారీ కాయంతో దర్శనమిచ్చాడు.
అయితే ఇప్పుడు ఆ అనంత్ను చూస్తే గుర్తు పట్టలేకపోవచ్చు. ఎందుకంటే... 180 కేజీల బరువున్న అతడు కేవలం 18 నెలల్లో బాగా కష్టపడి 108 కేజీల తగ్గిపోయి .... చక్కగా స్లిమ్గా తయారయ్యాడు. స్లిమ్గా తయారయ్యేందుకు అతడు చాలా వరకు సహజ మార్గలనే అనుసరించాడు. రోజుకు 5- 6 గంటలు పాటు వ్యాయామం చేసేవాడు. అలాగే ప్రతిరోజూ 21 కిలోమీటర్లు నడక సాగించేవాడు. వీటితోపాటు యోగా... అధిక తీవ్రత ఉన్న గుండెకు సంబంధించిన వ్యాయామం చేశాడు. సరిపడనంత ప్రోటీనులనే తీసుకున్నారు. అనంత్ ఇలా మారడం కోసం అతడి తల్లి నీతా అంబానీ అన్ని దగ్గర ఉండి చూసుకునేది.
అనంత చిన్నతంలో ఆస్తమాతో బాధపడేవాడు.ఆ సమయంలో వాడిన మందుల వల్ల భారీ స్థూలకాయం వచ్చింది. ఇదే రీతిలో ఉంటే భవిష్యత్తులో మరిన్నీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. దీంతో తన బరువును తగ్గించుకున్నాడు. జంతు ప్రేమికుడైన అనంత్ ప్రస్తుతం యూఎస్లోని బ్రౌన్ యూనివర్సిటీలో చదువుతున్నారు.


