ఆ డబ్బంతా నల్లధనమేనా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకే ఒక్క ప్రకటనతో పెద్దనోట్లను రద్దు చేశారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- నల్లధనం వెలికితీయడానికి మేం వ్యతిరేకం కాదు
 - బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్ పెరుగుతున్న కొద్ది నగదు విత్ డ్రాను కేంద్రం పెంచుతోంది
 - నగదు రహిత దేశమన్న నేతలు సామాన్యుల కడుపులు నింపే దాబాల్లో కార్డులు చెల్లవని మర్చిపోయారు
 - ఎలాంటి సమయం ఇవ్వకుండా, హెచ్చరిక చేయకుండా పెద్దనోట్లు రద్దు చేశారు
 - రైతుల వద్ద క్రెడిట్ కార్డులు ఉన్నాయా?
 - దేశ ప్రజలకు అన్నం పెడుతున్న రైతన్నలు నల్లధనాన్ని ఇంటికి తీసుకువెళుతున్నారా?
 - సామాన్యుల వద్ద ఉన్న రూ.500, 1000నోట్లు నల్లధనమా
 - ప్రతి విషయాన్ని సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు.
 - ఏమీ చదువుకోకుండానే మీరంతా డాక్టర్లు అయ్యారు
 - నోట్ల రద్దుతో మీరు ఎంపిక చేసుకున్న 15-20మంది పారిశ్రామిక వేత్తలకు సాయం చేశారు
 - రెండున్నరేళ్లలో అప్పు మాఫీ చేసింది ఎవరికీ, రైతులకా? పారిశ్రామికవేత్తలకా?
 - మీకు నచ్చినవాళ్లను నెత్తిన పెట్టుకుంటున్నారు
 - తప్పు చేశారని ప్రశ్నిస్తే నిందిస్తున్నారు
 - ప్రధాని మోదీ మరో గ్రహంలో ఉన్నారా అని ఆలోచన కలుగుతోంది
 - ప్రధాని మోదీ మరో గ్రహంలో ఉన్నారా అని ఆలోచన కలుగుతోంది
 - రంగుపోయే రూ.2వేల నోటును ఎవరూ నమ్మడం లేదు
 - నల్లధనం సూట్కేసుల్లోనూ, కప్ బోర్డులోనూ లేదు
 - వేలకోట్ల నల్లధనవంతులతో మోదీ విమానాల్లో తిరుగుతున్నారు
 - స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నవారి పేర్లు బయటపెట్టాలి
 - ఆస్తులు, పెట్టుబడుల రూపంలో
 - నోట్ల రద్దు వల్ల శుభకార్యాలు నిలిచిపోయాయి
 - దహన సంస్కారాలపై కూడా రద్దు ప్రభావం పడింది
 - సామాన్యులకు ప్రధాని క్షమపణ చెప్పాలి
 - 1946లో తొలిసారి, 1978లో రెండోసారి నోట్ల రద్దు జరిగింది
 - అప్పుడు ఇలాంటి గందరగోళం ఏర్పడలేదు
 - నోట్ల రద్దు పక్షపాతంతో తీసుకున్న నిర్ణయం
 - దేశం మొత్తాన్ని మీరు క్యూలో నిలబెట్టారు
 - బ్యాంకుల ముందు ఎవరైనా ధనికులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారా?
 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
