అలియా, అనుష్కలు స్పందించారు! | Alia, Anushka come out in support of ‘voiceless’ | Sakshi
Sakshi News home page

అలియా, అనుష్కలు స్పందించారు!

Jul 11 2016 2:00 PM | Updated on Sep 4 2017 4:37 AM

అలియా, అనుష్కలు స్పందించారు!

అలియా, అనుష్కలు స్పందించారు!

కుక్కను భవనంపైనుంచీ అమానుషంగా విసిరేయడమే కాక ఆ దృశ్యాలను వీడియో చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తుల దుశ్చర్యలను ప్రముఖ నటీమణులు అనుష్కాశర్మా, అలియాభట్ లు ఖండించారు.

ఇటీవల బహుళ అంతస్తుల భవనంపైనుంచి కుక్కను కిందికి విసిరిన వైద్య విద్యార్థుల దుశ్చర్యపై నటీమణులు అలియా భట్, అనుష్కా శర్మలు స్పందించారు. వైద్య విద్యార్థులయ్యుండి అటువంటి చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. సమాజానికి నష్టాన్ని కలిగించే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు.

కుక్కను భవనంపైనుంచీ అమానుషంగా విసిరేయడమే కాక ఆ దృశ్యాలను వీడియో చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తుల దుశ్చర్యలను ప్రముఖ నటీమణులు అనుష్కాశర్మా, అలియాభట్ లు ఖండించారు. అటువంటి కిరాతక, రాక్షస చర్యలకు పాల్పడే వారు సమాజానికి చీడపురుగుల్లాంటి వారని, వారిని సులభంగా వదిలి పెట్టకోడదని అన్నారు. ఓ జంతువు ప్రాణంతో చెలగాటమాడటం నిజంగా క్షమించరాని నేరంగా పరిగణించాలని, అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని తమ ట్వీట్స్ లో తెలిపారు. జంతు హింసకు పాల్పడిన వారిని వదల కూడదంటూ సదరు నటీమణులు జంతు ప్రేమికులకు మద్దుతుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement