ముఖ్యమంత్రి రథయాత్ర వాయిదా | Akhilesh yadav postpones Samajwadi Vikas Rath Yatra | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి రథయాత్ర వాయిదా

Sep 17 2016 6:02 PM | Updated on Sep 4 2017 1:53 PM

ముఖ్యమంత్రి రథయాత్ర వాయిదా

ముఖ్యమంత్రి రథయాత్ర వాయిదా

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాను తలపెట్టిన సమాజ్‌వాదీ వికాస్ రథయాత్రను వాయిదా వేసుకున్నారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తాను తలపెట్టిన సమాజ్‌వాదీ వికాస్ రథయాత్రను వాయిదా వేసుకున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి తలపెట్టిన ఈ యాత్రను మళ్లీ ఎప్పటి నుంచి ప్రారంభిచేదీ మళ్లీ ప్రకటిస్తామని చెప్పారు. అక్టోబర్ 4వ తేదీన కాన్పూర్‌లో మెట్రోరైలు పనులకు శంకుస్థాపన చేస్తానని, యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభించేదీ ఆ తర్వాత నిర్ణయిస్తామని అన్నారు.

ఏ దిశ నుంచి యాత్రను ప్రారంభించాలన్న విషయాన్ని కూడా ఇంకా నిర్ణయించుకోవాల్సి ఉందని అఖిలేష్ యాదవ్ చెప్పారు. 'అభివృద్ధి నుంచి విజయం దిశగా' అనే నినాదంతో అక్టోబర్ 3వ తేదీ నుంచి సమాజ్‌వాదీ వికాస్ రథయాత్రను ప్రారంభిస్తానని అఖిలేష్ యాదవ్ సెప్టెంబర్ 14వ తేదీన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఆ ట్వీట్‌లో ఆయన ఓ బస్సులో కూర్చున్న ఫొటోను కూడా ఉంచారు.

 

Advertisement
 
Advertisement
Advertisement