ఐఏఎఫ్‌ ఏఎన్‌ 32 విమానం ఆచూకీ గల్లంతు | Air Force Plane Carrying 13 Missing After Taking Off From Assam | Sakshi
Sakshi News home page

విమానంలో సిబ్బందితో సహా 13 మంది ప్రయాణికులు

Jun 3 2019 4:37 PM | Updated on Jun 3 2019 7:59 PM

Air Force Plane Carrying 13 Missing After Taking Off From Assam - Sakshi

న్యూఢిల్లీ : భార‌తీయ వైమానిక ద‌ళానికి చెందిన ఏఎన్‌-32 ఎయిర్‌క్రాఫ్ట్ ఆచూకీ గల్లంతయ్యింది. అస్సాంలోని జోర్‌హాట్ నుంచి ఆంట‌నోవ్ 32 విమానం.. సోమవారం మధ్యాహ్నం 12.25 నిమిషాల‌కు టేకాఫ్ అయ్యింది. ఈ విమానం అరుణాచ‌ల్ ప్రదేశ్‌లోని మెచుకా ల్యాండింగ్ గ్రౌండ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్‌ అయిన 35 నిమిషాలకు అంటే మధ్యాహ్నం 1గంట తర్వాత ఈ విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు వెల్లడించారు. ఈ విమానంలో 8 మంది సిబ్బందితో పాటు ఐదుగురు ప్రయాణికులు కలిపి మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

గల్లంతైన ఐఏఎఫ్ విమానం ఆచూకీ కోసం.. సుఖోయ్ 30 యుద్ధ విమానంతో గాలింపు చర్యలు చేప‌ట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. విమాన శకలాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని పయుమ్‌లో కనుగొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement