పాకిస్తాన్‌ యుద్ధ విమానాన్ని కూల్చేశాం : భారత్‌

Air Force Pilot missing after shot down a Pakistani jet says MEA - Sakshi

న్యూఢిల్లీ : భారత వైమానిక దాడులకు ప్రతిదాడిగా పాకిస్తాన్‌ ప్రయత్నించిందని భారత విదేశాంగశాఖ పేర్కొంది. ' 3 పాక్‌ జెట్‌ విమానాలు భారత గగనతలంలోకి వచ్చాయి. సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్‌ దాడులకు యత్నించింది. అప్రమత్తమైన భారతవైమానిక దళం వారి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌ 16 యుద్ధ విమానాన్ని కూల్చేశాం. ఈ ఘటనలో భారత్‌కు చెందిన మిగ్‌-21 విమానం కూలిపోయింది. ఒక పైలట్‌ జాడ తెలియడం లేదు' అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి తెలిపారు. 

మరోవైపు భారత పైలట్‌ తమ అధీనంలోనే ఉన్నారంటూ పాక్‌ ఓ వీడియోను విడుదల చేసింది. ‘నేను వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను. ఐఏఎఫ్‌ అధికారిని. నా సర్వీసు నెంబర్‌ 27981’ అని పైలట్‌ చెప్తున్న అంశాలు ఆ వీడియోలో ఉన్నాయి. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ మిగ్‌ 21 బైసన్‌ జెట్‌లో వెళ్లాడని, ఇప్పటికీ తిరిగి రాలేదని ఐఏఎఫ్‌ పేర్కొంది. వీడియో ఉన్నది అభినందనా కాదా అనేది తెలియాల్సి ఉంది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top