దేశీయ 'నేత్ర' | Air Force Gets 'Netra', The Game Changer In Warfare | Sakshi
Sakshi News home page

దేశీయ 'నేత్ర'

Feb 15 2017 10:25 AM | Updated on Sep 5 2017 3:48 AM

దేశీయ 'నేత్ర'

దేశీయ 'నేత్ర'

స్వదేశీ సాంకేతికతతో రూపొందిన 'నేత్ర' భారతీయ వాయుదళంలో చేరింది. నేత్రలో వినియోగించిన ఎయిర్‌బోర్న్‌ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టం(ఏఈడబ్ల్యూ​&సీ)ను దేశీయంగా అభివృద్ధి చేశారు.

స్వదేశీ సాంకేతికతతో రూపొందిన 'నేత్ర' భారతీయ వాయుదళంలో చేరింది. నేత్రలో వినియోగించిన ఎయిర్‌బోర్న్‌ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టం(ఏఈడబ్ల్యూ​&సీ)ను దేశీయంగా అభివృద్ధి చేశారు. యుద్ధ సమయాల్లో శత్రువుల రాకను దాదాపు 300 కిలోమీటర్లు ముందే నేత్ర గుర్తించగలదు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎయిర్‌ షో ఎరో ఇండియా ప్రారంభ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పరీకర్‌ నేత్రను ఐఏఎఫ్‌ స్క్వాడ్రన్‌కు అప్పగించారు. పంజాబ్‌లోని భతిండా బేస్‌ నుంచి నేత్ర తన సేవలను ప్రారంభించనుంది.  
 
నేత్రలో ఉపయోగించిన రాడార్‌ వ్యవస్ధ, మరికొన్ని కీలక విభాగాలు స్వదేశీయంగా అభివృద్ధి చేసినవే. ప్రస్తుతం రెండు నేత్ర విమానాలను ఐఏఎఫ్‌కు అందిస్తున్నారు. భవిష్యత్తులో నేత్ర సిస్టంను భారత ఇంజనీర్లు మరింత తీర్చిదిద్దుతారని భావిస్తున్నట్లు పరీకర్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement