‘ఉట్టి’ దిగులు..! | action on children who participated in Janmashtami Celebrations:Children's Rights Commission | Sakshi
Sakshi News home page

‘ఉట్టి’ దిగులు..!

Aug 10 2014 10:37 PM | Updated on Sep 2 2017 11:41 AM

ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్ల లోపు పిల్లలు పాల్గొన కుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని బాలల హక్కుల కమిషన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

సాక్షి, ముంబై: కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. అన్న సామెత చందంగా ఉంది ప్రస్తుతం నగర పోలీసుల పరిస్థితి.. ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్ల లోపు పిల్లలు పాల్గొన కుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని బాలల హక్కుల కమిషన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా పిల్లలు లేకుం డా ఉత్సవమా.. సమస్యే లేదు.. ఉట్టి ఉత్సవాల్లో పిల్లలు తప్పకుండా పాల్గొం టారని ఉత్సవ మండళ్లు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పోలీసుల పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా తయారైంది.

 ఈ నెల 17వ తేదీన (ఆదివారం) ఉట్టి ఉత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ ఉత్సవాల్లో పిల్లలు పాల్గొనే అంశం ఎటూ తేలకపోవడంతో మధ్యలో నగర పోలీసులు నలిగి పోతున్నారు. ఉత్సవాల్లో 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొంటే సంబంధిత ఉట్టి ఉత్స వ మండళ్లపై చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులదేనని బాలల హక్కుల సంఘం ఆదేశించింది. మరోపక్క పిల్లలతోనే ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తామని మండళ్లు సవాలు చేస్తున్నాయి. మండళ్ల వైఖరిపై పోలీసులు ఏ విధంగా స్పం దిస్తారనేదానిపై అందరి ధృష్టి పడింది. ఉట్టి ఉత్సవాల్లో 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనడంవల్ల వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.

 ఉట్టి పగులగొట్టే ప్రయత్నంలో అదుపుతప్పి పైనుంచి కిందపడడంవల్ల వారు వికలాంగులయ్యే ప్రమాదముంది. గతంలో జరిగిన ఘటనల్లో కొందరు వికలాంగులుగా మారారు. కొం దరు ప్రాణాలను పోగొట్టుకున్నారు. తాజాగా వారం కిందట నవీముంబైలోని సాన్‌పాడా ప్రాంతంలో ఉట్టిఉత్సవాలకు సాధన చేస్తుండగా కిరణ్ తల్కరే (14) అనే బాలుడు పైనుంచి కిందపడడంతో తలకు, చాతిలో గాయాలయ్యాయి. నేరుల్‌లోని సహ్యాద్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రెండు రోజులకు చనిపోయాడు. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకుని పిల్లలు ఉట్టి ఉత్పవాల్లో పాల్గొనడాన్ని బాలల హక్కుల సంఘం నిషేధించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

 అంతేగాక అలాంటి మండళ్లపై చర్యలు తీసుకునే బాధ్యత పోలీసులదేనని తేల్చిచెప్పిం ది. అయితే పిల్లలతోనే ఉట్టి ఉత్సవాలు నిర్వహిస్తామని నగరం, ఠాణే జిల్లాకు చెందిన సార్వజనిక ఉట్టి ఉత్సవ మండళ్లు ప్రభుత్వానికి, బాలల హక్కుల సంఘానికి సవాలు విసిరాయి.

 అందుకు మహిళ గోవిందాందాలు కూడా మద్దతు పలికాయి. దీంతో ఏం చేయాలో తెలియక  మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారు. ఇదిలాఉండగా ఈ సమస్యపై త్వరలో పరిష్కారం కనుగొంటామని మహారాష్ట్ర రాష్ట్ర బాలల హక్కు ల సంరక్షణ కమిషన్ అధ్యక్షుడు ఉజ్వల్ ఉకే అన్నారు. గృహనిర్మాణ శాఖ సహా య మంత్రి సచిన్ అహిర్ సైతం ఈ వివాదాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని వా రం కిందట ప్రకటించారు. కాని ఇంతవరకు సమస్య ఓ కొలిక్కిరాకపోవడంతో ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారనేది ఉత్కంఠగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement