
58 కిలోల బంగారం పట్టివేత
అక్రమంగా రవాణా చేసిన రూ. 18 కోట్ల విలువైన 58 కిలోల బంగారాన్ని రెవెన్యూ అధికారులు కోల్‌కతాలో పట్టుకున్నారు.
కోల్‌కతా: అక్రమంగా రవాణా చేసిన రూ. 18 కోట్ల విలువైన 58 కిలోల బంగారాన్ని రెవెన్యూ అధికారులు శనివారం కోల్‌కతాలో పట్టుకున్నారు. ఈ రాకెట్‌తో సంబంధమున్నట్లు భావిస్తున్న మహిళ సహా 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. సిటీ కోర్టు వారికి ఆగస్టు 24 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
రహస్య సమాచారంతో అధికారుల ప్రత్యేక బృందం ఉత్తర కోల్‌కతాలోని రవీంద్ర సరానీ సమీపంలో ఉన్న స్థావరంపై దాడులు జరిపి 350 బంగారు బిస్కట్లను స్వాధీనం చేసుకుంది. మయన్మార్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేసి, ముంబైలో తలదాచుకుంటున్న బృందంతో వీరికి సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు.