ఏటా 5.08% పెరుగుతున్న ప్రింట్ మీడియా | 5.08% per year, growing print media | Sakshi
Sakshi News home page

ఏటా 5.08% పెరుగుతున్న ప్రింట్ మీడియా

Jun 5 2016 1:45 AM | Updated on Oct 9 2018 6:34 PM

విదేశాల మాదిరి కాకుండా భారత్‌లో ప్రచురణ మాధ్యమం అంతకంతకూ పెరుగుతోంది

పత్రికల ఆడిట్ సంస్థ ఏబీసీ వెల్లడి

 ముంబై: విదేశాల మాదిరి కాకుండా భారత్‌లో ప్రచురణ మాధ్యమం అంతకంతకూ పెరుగుతోంది. టెలివిజన్, రేడియో, డిజిటల్ మీడియా నుంచి తీవ్రపోటీని తట్టుకుంటూ కూడా దేశంలో ప్రింట్ మీడియా ఏటా 5.04 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నట్లు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) తెలియజేసింది.

ఈ సంస్థ 68 ఏళ్లుగా పత్రికల సర్క్యులేషన్‌ను ప్రతి 6 నెలలకు ధ్రువీకరిస్తుంటుంది.  90 ఆడిటింగ్ సంస్థల ద్వారా ప్రాసెస్ చేసి గణాంకాలను ధ్రువపరుస్తున్నట్లు ఏబీసీ తెలియజేసింది. ప్రస్తుతం తమ పరిధిలో 669 వార్తా పత్రికలు, 50 మ్యాగజైన్లు నమోదై ఉన్నట్లు సంస్థ తెలిపింది. గడిచిన ఎనిమిదేళ్లుగా ఏటా 5.04 శాతం చొప్పున ప్రింట్ మీడియా పెరుగుతూనే వస్తోంది. ‘ప్రస్తుత పత్రికలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దీంతో పాటు కొత్త పత్రికలూ పుట్టుకొస్తున్నాయి. అందుకే ఈ వృద్ధి సాధ్యమైంది’ అని సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement