ఆహారం వికటించి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా.. ఐదుగురు తీవ్ర అస్వస్థత పాలయ్యారు.
ఫుడ్ పాయిజన్: ముగ్గురు మృత్యువాత
Aug 8 2017 4:17 PM | Updated on Sep 11 2017 11:36 PM
జైపూర్: ఆహారం వికటించి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందగా.. ఐదుగురు తీవ్ర అస్వస్థత పాలయ్యారు. బన్‌స్వారా జిల్లా మల్వాసా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లెంజీ బమానియా(60) కుటుంబసభ్యులు మొత్తం 8 మంది సోమవారం రాత్రి ఇంట్లో చేసిన వంటకాలు తిన్నారు. ఆ ఆహారం విషపూరితం కావటంతో అర్థరాత్రి నుంచి వారంతా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
చుట్టుపక్కల వారు వెంటనే అందరినీ జైపూర్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బమానియా, ఆయన కోడలు సవితతో పాటు మరో మహిళ(35) చనిపోగా మరో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హీరాలాల్ తెలిపారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement