మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో గురువారం మావోయిస్టులు జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో ముగ్గురు పోలీసులు సహా 10మంది ప్రాణాలు కోల్పోయారు.
గడ్చిరోలి/ఔరంగాబాద్: మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో గురువారం మావోయిస్టులు జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో ముగ్గురు పోలీసులు సహా 10మంది ప్రాణాలు కోల్పోయారు. మహా రాష్ట్రలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వద్దనున్న గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో జరిపిన మందుపాతర పేలుడులో సీ-60 కమాండో దళానికి చెందిన ముగ్గురు పోలీసులు మరణించారు.
మావోల కదలికలపై సమాచారం అందుకున్న పోలీసులు గ్యారపట్టి పోలీ స్ స్టేషన్ పరిధిలోని బడా జరియా అటవీ ప్రాంతంలో గాలింపు కొనసాగిస్తుండగా, ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మందుపాతర పేలుడు తర్వాత పోలీసులకు, మావోయిస్టులకు నడుమ పరస్పర కాల్పులు జరిగినట్లు స్థానికులు చెప్పారు. కాగా, బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా పథరా గ్రామం వద్ద ఒక వాహనం ప్రయాణిస్తుండగా, మావోలు బాంబు పేల్చడంతో అందులోని ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.