‘సీసా’లో ఏముంది?

‘సీసా’లో ఏముంది?

‘‘ఎమోషన్స్ అన్నీ కలిస్తే జీవితం... ఒక్క ముక్కలో చెప్పాలంటే... మా ‘సీసా’ చిత్ర కథ అదే’’ అంటున్నారు శివాజి. ఆయన కథానాయకునిగా రూపొందిన ఈ చిత్రంలో చెస్వా, నమ్రత కథానాయికలు. ఎండి ఇషాక్ దర్శకుడు. జగదీష్ పెనుమాదు నిర్మాత. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివాజీ మాట్లాడుతూ  -‘‘ఈ కథ వినగానే ఇందులో ఎమోషన్స్ నన్ను కట్టిపడేశాయి. 

 

 ఏ భాషకైనా సరిపోయే కథ ఇది. ఈ కథ నచ్చి ఇప్పటికే కన్నడ నిర్మాతలు హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు. యూరోపియన్ భాషలో కూడా ఈ కథను తెరకెక్కించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సూపర్హిట్ అయ్యే సినిమా అని చెప్పను కానీ, ఓ మంచి సినిమా అని మాత్రం చెప్పగలను. సెన్సార్ పూర్తి చేసి ఈ నెల 21 గానీ, 27న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘‘తొలుత తమిళ్లో ‘అగడం’ అనే సినిమా చేశాను. అది గిన్నిస్బుక్లో స్థానం సంపాదించుకుంది.

 

 ఇక ‘సీసా’ విషయానికొస్తే... ఇదొక మంచి ప్రయత్నం. సాంకేతికంగా ఉన్నతంగా ఉండే సినిమా ఇది’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాత చెబుతూ -‘‘పంపిణీదారునిగా పెద్ద సినిమాలే చేసిన నేను, కథ నచ్చడంతో ఈ చిన్న చిత్ర నిర్మాణానికి పూనుకున్నాను. 90 రోజుల చిత్రీకరణతో చిత్రాన్ని పూర్తి చేశాం’’ అని తెలిపారు. ఛాలెంజ్గా తీసుకొని ఈ చిత్రానికి మాటలు రాశానని బాషాశ్రీ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: కె.భాస్కర్, కెమెరా: ఇ.జె.నౌజద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజశేఖర్ నల్లూరి, సహ నిర్మాతలు: ఎం.డి.ఇషాక్, ఎం.డి.రజియాబీ.

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top