మరో రీమేక్‌లో ‘ఫలక్‌నుమా దాస్‌’

Vishwak Sen in talk For Sonu Ki Titu Ki Sweety Telugu Remake - Sakshi

మలయాళ సినిమా అంగమలై డైరీస్‌ను తెలుగులో ‘ఫలక్‌నుమా దాస్‌’గా తెరకెక్కించిన విశ్వక్‌ సేన్‌.. హీరోగా, దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో మరో క్రేజీ రీమేక్‌కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన రొమాంటిక్‌ కామెడీ ‘సోనుకి టిటుకి స్వీటి’ తెలుగు రీమేక్‌ కోసం విశ్వక్‌ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది.

కార్తీక్‌ ఆర్యన్‌, సన్ని సింగ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు లవ్‌ రంజన్‌ దర్శకుడు. ఈ బాలీవుడ్‌ సినిమా రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్న సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ, విశ్వక్‌ సేన్‌ హీరోగా తెలుగులో రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top