మాణిక్‌ ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరణ | Vishal releases Manik's first look | Sakshi
Sakshi News home page

మాణిక్‌ ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరణ

Sep 16 2017 4:56 AM | Updated on Sep 19 2017 4:36 PM

మాణిక్‌ ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరణ

మాణిక్‌ ఫస్ట్‌లుక్‌ ఆవిష్కరణ

గురువారం తన చిత్రం తుప్పరివాలన్‌ చిత్రాన్ని విడుదల చేసిన నటుడు విశాల్‌ శుక్రవారం మాణిక్‌ అనే చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

తమిళసినిమా: బుల్లితెరలో పాపులర్‌ అయిన నటుడు మాకాపా ఆనంద్‌ ఇప్పుడు వెండితెరపై గుర్తుంపు తెచ్చుకుంటున్నారు. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం మాణిక్‌. ఎదుర్‌నీశ్చల్‌ చిత్రం ఫేమ్‌ సుశకుమార్‌ కథానాయకిగా నటించిన ఇందులో రెండవ కథానాయకిగా వత్సన్‌ నటించింది. హోహిత సినీ టాకీస్‌ పతాకంపై ఎం.సుబ్రమణియం నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా మార్టిన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పలు లఘు చిత్రాలను రూపొందించి అవార్డులను అందుకున్న ఈయన నాళైఇయక్కునార్‌ సీజన్‌ 5లో విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకున్నారన్నది గమనార్హం.

మాణిక్‌ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది స్నేహం, వినోదం కలిపిన జనరంజక చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన బాషా చిత్రంలోని రజనీకాంత్‌లో మాపాకా ఆనంద్‌ ఉన్న పోస్టర్లకు మంచి స్పందన వస్తోందన్నారు. మాణిక్‌ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్‌ సంఘం కార్యదర్శి ఆవిష్కరించారని తెలిపారు. దీంతో చిత్రంపై ప్రేక్షకుల్లో, పరిశ్రమ వర్గాల్లోనూ మాణిక్‌ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగిందని అన్నారు. త్వరలోనే చిత్ర ఆడియోను, ఈ తరువాత చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement