విజయ్ మిల్టన్‌తో మరో చిత్రం | Vikram, Vijay Milton to team up once again | Sakshi
Sakshi News home page

విజయ్ మిల్టన్‌తో మరో చిత్రం

Dec 6 2014 2:31 AM | Updated on Apr 3 2019 8:57 PM

విజయ్ మిల్టన్‌తో మరో చిత్రం - Sakshi

విజయ్ మిల్టన్‌తో మరో చిత్రం

ఒక ప్రముఖ హీరో ఒక దర్శకుడితో వెంటవెంటనే చిత్రాలు చేయడం అరుదైన విషయమే.

ఒక ప్రముఖ హీరో ఒక దర్శకుడితో వెంటవెంటనే చిత్రాలు చేయడం అరుదైన విషయమే. మొదటి చిత్రంలోనే చిన్న చిన్న విషయాలతో దర్శక, హీరోల మధ్య విభేదాలు ఏర్పడే ఈ రోజుల్లో ఒక చిత్రం నిర్మాణంలో ఉండగానే నటుడు విక్రమ్ దర్శకుడు విజయ్ మిల్టన్‌కు మరో అవకాశం ఇచ్చేశారన్నది తాజా సమాచారం. విజయ్ మిల్టన్ ఛాయాగ్రాహకుడిగా ప్రముఖ దర్శకుడిగా మాత్రం ఒక్క చిత్రం అనుభవమే. బాల తారలతో గోలీసోడా తీసి అనూహ్య విజయాన్ని అందుకున్న దర్శకుడీయన. మలి చిత్రంగా విక్రమ్ హీరోగా 10 ఎండ్రదు కుళ్ల అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణం తుది దశకు చేరుకుంది. కాగా ఈ చిత్రం విడుదల కాకుండానే రిజల్ట్ తెలియకుండానే విజయ్‌మిల్టన్‌కు వెంటనే తదుపరి అవకాశం కూడా ఇచ్చేశారట.. హీరో విక్రమ్.

అందుకు కారణం విజయ్ మిల్టన్ పనితీరే ఆయన స్పీడు విక్రమ్‌కు తెగ నచ్చేశాయట. ఐ చిత్రం పూర్తి చేసిన తరువాత విక్రమ్ విజయ్‌మిల్టన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అయ్యారు. చాలా తక్కువ కాలంలోనే 10 ఎండ్రదు కుళ్ల చిత్రాన్ని దర్శకుడు పూర్తి చేశారు. అంతేకాకుండా తదుపరి చిత్రానికి సిద్ధం చేసిన స్క్రిఫ్టును కూడా విక్రమ్‌కు బాగా నచ్చిందట. దీంతో విజయ్ మిల్టన్ తదుపరి చిత్రానికి విక్రమ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్‌కు వెళ్లనుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement