‘బాహుబలి’తో మార్కెట్‌ పెరుగుతుందని.. | Vijayendra Prasad Sensational Comments on Bahubali 2 | Sakshi
Sakshi News home page

‘బాహుబలి’తో మార్కెట్‌ పెరుగుతుందని..

May 16 2017 11:33 PM | Updated on Sep 5 2017 11:18 AM

‘బాహుబలి’తో మార్కెట్‌ పెరుగుతుందని..

‘బాహుబలి’తో మార్కెట్‌ పెరుగుతుందని..

బాహుబలి’ విడుదల తర్వాత రెండు ప్రశ్నలు నన్ను వెంటాడాయి. ఒకటి – ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని’. ‘బాహుబలి–2’తో ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది.

– విజయేంద్రప్రసాద్‌
‘‘బాహుబలి’ విడుదల తర్వాత రెండు ప్రశ్నలు నన్ను వెంటాడాయి. ఒకటి –‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని’. ‘బాహుబలి–2’తో ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. రెండోది – ‘శ్రీవల్లీ’ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేద్దామని’. చాలా రోజులుగా ఈ చిత్రబృందం రెండో ప్రశ్న అడుగుతున్నారు. ‘బాహుబలి–2’ తర్వాత ‘శ్రీవల్లీ’ విడుదల చేస్తే మార్కెట్‌ పెరుగుతుందనే ఆలోచనతో వెయిట్‌ చేశాం. జూన్‌లో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు విజయేంద్రప్రసాద్‌.

 ఆయన దర్శకత్వంలో రజత్, నేహా హింగే జంటగా సునీత, రాజ్‌కుమార్‌ బృందావనం నిర్మించిన చిత్రం ‘శ్రీవల్లీ’. మంగళవారం హైదరాబాద్‌లో ‘శ్రీవల్లీ’ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ‘‘ఇది ఎరోటిక్‌ థ్రిల్లర్‌ మూవీ. మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది’’ అని విజయేంద్రప్రసాద్‌ చెప్పారు. ‘‘మా ధైర్యం, బలం అన్నీ విజయేంద్రప్రసాద్‌గారే. ఆయన కథ, దర్శకత్వంపై నమ్మకంతో మూడు భాషల్లో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement