‘సరిలేరు నీకెవ్వరు’.. విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ ఇదే | VijayaShanthi First look From Mahesh Babu Sarileru Neekevvaru | Sakshi
Sakshi News home page

విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌.. 

Oct 26 2019 9:54 AM | Updated on Oct 26 2019 10:17 AM

VijayaShanthi First look From Mahesh Babu Sarileru Neekevvaru - Sakshi

తెరపై ఆమెను చూడటం అద్భుతంగా ఉందని పేర్కొన్న హీరో రానా

బ్రేక్‌ ఇచ్చింది సినిమాలకు మాత్రమే కానీ తనలోని నటనకు, అభినయానికి కాదని ఒకేఒక్క స్టిల్‌తో అందరికి సమాధానమచ్చారు లేడీ అమితాబ్‌ విజయశాంతి. దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఈ లేడీ సూపర్‌స్టార్‌.. మహేష్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంలో విజయశాంతి పాత్రపై అందరిలోనూ ఆసక్తి, అంచనాలు భారీగా నెలకొన్నాయి.

తాజాగా దీపావళి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరూ’ టీం ఈ చిత్రంలో విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ మూవీలో విజయశాంతి భారతి పాత్రలో చాలా డీసెంట్‌ అండ్‌ క్లాస్‌గా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. అయితే మరో యాంగిల్‌లో తన చూపుతోనే విలన్‌లకు గట్టి వార్నింగ్‌ ఇచ్చినట్లు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మరి ‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి పవర్‌ ఫుల్‌ పాత్ర పోషిస్తుందా లేక క్లాస్‌గా కనిపించనుందా అనేది సినిమా రిలీజ్‌ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుతం విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. చాలా లాంగ్‌ గ్యాప్‌ తర్వాత తమ అభిమాన నటి ఫస్ట్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్‌ తెగ ఆనందపడుతున్నారు. అంతేకాకుండా లేడీ సూపర్‌స్టార్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇక విజయశాంతి ఫస్ట్‌ లుక్‌పై హీరో రానా స్పందించాడు. ‘తెరపై ఆమెను చూడటం అద్భుతంగా ఉంది’ అంటూ కామెంట్‌ చేశాడు.  

కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్‌ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర‌లో మహేష్‌ ఒదిగిపోయారని, సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు సంక్రాంతికి డబుల్‌ ధమాకా అని చిత్ర యూనిట్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ సాంగ్‌తో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల కానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement