వైరల్‌ : విజయ్‌ మైనపు బొమ్మలు..! | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 3 2018 9:53 AM

Vijay Sethupathi Wax Statue At Multiplexes Goes Viral - Sakshi

విజయ్‌ సేతుపతి.. తన సహజ నటనతో తమిళ ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. అటు మాస్‌ ఆడియెన్స్‌ ఫాలోయింగ్‌ ఉన్నా.. తన క్లాస్‌ యాక్టింగ్‌తో విజయ్‌ అందరికీ చేరువయ్యాడు. రీసెంట్‌గా 96 సినిమాతో మరోసారి సూపర్‌హిట్‌ను కొట్టాడు. అయితే ప్రస్తుతం తమిళనాట విజయ్‌ సేతుపతి నటించే తదుపరి చిత్రం గురించి చర్చ నడుస్తోంది.

భారతీయుడులో కమల్‌హాసన్‌ గెటప్‌లా ఉందని నెగెటివ్‌ కామెంట్‌ వచ్చినా.. విజయ్‌ ఆ లుక్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. ‘సీతాకది’ సినిమాలోని ఈ లుక్‌ వైరల్‌ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు పెంచింది చిత్రయూనిట్‌. షాపింగ్‌ మాల్స్‌,  మల్టీప్లెక్స్‌లో సీతాకది చిత్రంలోని గెటప్‌లతో కూడిన మైనపు బొమ్మలను ఏర్పాటు చేశారు. వీటికి విశేషమైన స్పందన వస్తోంది. ఇవి ప్రస్తుతం సెల్ఫీ స్పాట్‌లుగా మారడటంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. విజయ్‌ సేతుపతికి ఇది 25వ చిత్రం కాగా.. ఈ మూవీ డిసెంబర్‌ 20న విడుదల కానుంది.  
 

Advertisement
 
Advertisement
 
Advertisement