హ్యాట్రిక్‌పై గురి! | Vijay Sethupathi and Anjali's New Movie Launch | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌పై గురి!

Jun 8 2018 12:49 AM | Updated on Jun 8 2018 12:49 AM

Vijay Sethupathi and Anjali's New Movie Launch - Sakshi

విజయ్‌ సేతుపతి, అంజలితో చిత్రబృందం

అరడజనకుపైగా సినిమాలు చేతిలో ఉంచుకుని మరో సినిమాకు పచ్చజెండా  ఊపడం అంటే ఏ హీరోకైనా కాస్త ధైర్యం ఉండాలి. తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఫుల్‌ డేరింగ్‌. అందుకే కొత్త సినిమాకు ఓకే అనేశారు. జీఎస్‌. అరుణ్‌ కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ సేతుపతి హీరోగా కొత్త సినిమా మొదలైంది. ఇందులో తెలుగమ్మాయి అంజలి కథానాయిగా నటించనున్నారు. విజయ్‌ సేతుపతి, అరుణ్‌ కాంబోలో రూపొందనున్న థర్డ్‌ మూవీ ఇది.

ఇది వరకు వీళ్ల కాంబోలో ‘పన్నైయారుమ్‌ పద్మినియుమ్, సేతుపతి’ చిత్రాలు విడుదలై మంచి టాక్‌ తెచ్చుకున్నాయి. ఇప్పుడీ కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అంటే హ్యాట్రిక్‌పై గురి పెట్టారన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే.. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్య్ర సమరయోధుడు ఊయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా’ చిత్రంలో విజయ్‌ ఓ కీలక పాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement