విజయ్‌ సినిమాలో విలన్‌గా విజయ్‌! | Vijay Sethupathi Acting As Villain In Ilayathalapathy Vijay New Movie | Sakshi
Sakshi News home page

విజయ్‌ సినిమాలో విలన్‌గా ‘విజయ్‌’

Sep 30 2019 6:05 PM | Updated on Sep 30 2019 6:05 PM

Vijay Sethupathi Acting As Villain In Ilayathalapathy Vijay New Movie - Sakshi

అదేంటి.. అతని సినిమాలో అతనే విలన్‌గా నటించనున్నారని అనుకుంటున్నారా? ఆ ఇద్దరు విజయ్‌లు ఎవరని అనుకంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. ఇళయ దళపతి విజయ్‌ సినిమాలో మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

ఇళయ దళపతి విజయ్‌ తదుపరి చిత్రంలో విజయ్‌ సేతుపతి విలన్‌ క్యారెక్టర్‌ను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్‌లో జాయిన్‌ అయినట్లు మేకర్స్‌ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ణు కూడా రిలీజ్‌చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విజయ్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో బిగిల్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సైరా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు విజయ్‌ సేతుపతి సిద్దంగా ఉన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement