థాంక్యూ నాగ్ సర్.. గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే మేము రెడీ : విజయ్‌ | Vijay Devarakonda Respond On Nagarjuna Tweet | Sakshi
Sakshi News home page

సీనియర్లు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. మేము రెడీ : విజయ్‌

May 5 2020 6:57 PM | Updated on May 5 2020 7:07 PM

Vijay Devarakonda Respond On Nagarjuna Tweet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అసత్యపు వార్తలు రాసే కొన్ని వెబ్‌సైట్లపై విజయ్ దేవరకొండ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు తప్పుడు వార్తలు రాస్తున్నారని, అలాంటి వెబ్‌సైట్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే ఆ వీడియోలో విజయ్ పేర్కొన్న అంశాలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు పెద్దఎత్తున స్పందిస్తూ ఆయనకు మద్దతు పలుకుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, రవితేజ, క్రిష్‌, కొరటాల శివ, పూరి జగన్నాథ్‌, హరీష్‌ శంకర్‌, నాగబాబు తదితరులు మద్దతుగా నిలిచారు. తాజాగా హీరో నాగార్జున కూడా విజయ్‌కు మద్దతు ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. నాగార్జున స్పందిస్తూ, మద్దతు ప్రకటించడం కంటే ఇప్పుడు కావాల్సింది సమస్య పరిష్కారానికి తగిన యాక్షన్ ప్లాన్ అని స్పష్టం చేశారు. దీనిపై విజయ్ దేవరకొండ స్పందించాడు.
(చదవండి : ‘మీరెవరు నన్ను అడగడానికి.. అది నా ఇష్టం’)

యాక్షన్ ప్లాన్ అనే మాట వింటుంటేనే ఉత్సాహం కలుగుతోందని, మీరు కూడా రంగంలోకి దూకి సమస్య తీవ్రతను మరింత స్పష్టంగా వినిపిస్తున్నందుకు థాంక్యూ నాగ్ సర్ అని రిప్లై ఇచ్చారు. ‘సీనియర్లు గనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాన్ఫరెన్స్ కాల్ ద్వారా చర్చించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. తద్వారా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న ఈ సమస్యను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్మూలించగలం’ అని విజయ్‌ ట్వీట్‌ చేశారు.
(చదవండి : విజయ్‌ దేవరకొండకు విశేష మద్దతు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement