‘ఈ చిత్రం నాకు, వెంకీకి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌’ | Sakshi
Sakshi News home page

‘ఈ చిత్రం నాకు, వెంకీకి థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌’

Published Thu, Feb 20 2020 12:01 PM

Venkateshs Narappa Telugu Movie New Update - Sakshi

విక్టరీ వెంకటేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నారప్ప’. కోలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘ధనుష్‌ అసురన్‌’కు నారప్ప తెలుగు రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన వెంకటేష్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ స్టన్నింగ్‌గా ఉండటంతో సినిమాపై అంచనాలు హై రేంజ్‌కు వెళ్లాయి. సురేష్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం తమిళనాడులోని తిరిచందూర్‌ సమీపంలో ఉన్న తెరికాడులో పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో నారప్పకు సంబంధించి కీలక యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కిస్తున్నారు. మరికొన్ని ఇక్కడే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. 

ఈ సందర్భంగా యాక్షన్‌ సన్నివేశాల గురించి పీటర్‌ హెయిన్స్‌ మాట్లాడుతూ.. ‘ రెడ్‌ డెసర్ట్‌ ఆఫ్‌ తమిళనాడు(తెరికాడు)లో పది రోజులుగా తీసిన యాక్షన్‌​ సీన్స్‌ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ‘నారప్ప’ చిత్రం వెంకటేష్‌కు నాకు థ్రిల్లింగ్‌ ఎక్సిపీరియన్స్‌ ఇస్తోంది’అని అన్నారు. ‘నారప్ప మోస్ట్‌ పవర్‌ఫుల్‌, ఎమోషనల్‌ క్యారెక్టర్‌. ప్రేక్షకులు ‘నారప్ప’ చిత్రంలో కొత్త వెంకటేష్‌ను చూస్తారు’అని దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ విజయ్‌ శంకర్‌ దొంకాడ మాట్లాడుతూ.. ఇప్పటికే ఇక్కడ 27 రోజులు కంటిన్యూగా షూటింగ్‌ చేశామని, ఇంకా నాన్‌స్టాప్‌గా షెడ్యూల్‌ జరుగుతుందన్నారు. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. సామ్‌.కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి  సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంత శ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం పాటలు అందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement