ముచ్చటగా మూడోసారి! | Venkatesh, Nayantara team up for the third time | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడోసారి!

Nov 25 2015 11:53 PM | Updated on Sep 3 2017 1:01 PM

ముచ్చటగా మూడోసారి!

ముచ్చటగా మూడోసారి!

అద్భుతమైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల వారినీ అలరించే కథానాయకుడు వెంకటేశ్.

అద్భుతమైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల వారినీ అలరించే కథానాయకుడు వెంకటేశ్. అందచందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేసే కథానాయిక నయనతార. ఈ జంట ‘లక్ష్మీ’, ‘తులసి’ చిత్రాలతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముచ్చటగా మూడోసారి అలరించడానికి వీళ్ళు రెడీ అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.2 గా సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించన్నారు.
 
 నిర్మాత మాట్లాడుతూ - ‘‘మారుతి చెప్పిన కథ వెంకటేశ్‌కు, మాకు నచ్చింది. ఆయన దర్శకత్వం వహించిన ‘భలే భ లే మగాడివోయ్’ చిత్రం విజయవంతం కావడంతో తాజా ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో సూపర్ పాజిటివ్ క్రేజ్ వచ్చింది. డిసెంబర్ 16న పూజా కార్యక్రమాలు జరిపి, అదే రోజున రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌ైటె నర్ ఇది. ఇప్పటివరకూ సినిమా టైటిల్ అనుకోలేదు. త్వరలో నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు చెబుతాం. వచ్చే ఏడాది  వేసవిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, సమర్పణ: ఎస్. రాధాకృష్ణ (చినబాబు), కెమెరా: ఎస్. వివేక్ ఆనంద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement