ప్రేమ విహారాలు

Varun Tej, Sai Sankalp's film to hit screens on Dec 21 - Sakshi

ఇద్దరు భామలతో స్పేస్‌లో ప్రేమ విహారం చేస్తున్నారట వరుణ్‌ తేజ్‌. మరి ఆ ఇద్దరిలో ఎవరితో ప్రేమలో పడతారో తెలియాలంటే సినిమా రిలీజ్‌ వరకూ ఆగాల్సిందే. ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా అంతరిక్ష్యం నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అదితీ రావ్‌ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలుగా కనిపించనున్నారు.

ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వై. రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. గురువారం మొదలైన కొత్త షెడ్యూల్‌ ఈ నెల 14 వరకూ జరగనుంది. ప్రత్యేకంగా వేసిన స్పేస్‌ సెట్లో ఈ షూటింగ్‌ చేస్తున్నారు. ఇందులో వరుణ్, అదితీ, లావణ్య ముగ్గురూ పాల్గొంటున్నారు. ఈ సినిమాను డిసెంబర్‌ 21న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌. విహారి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top