హ్యాపీడేస్‌ నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి

Varun Sandesh And Vithika Sheru In Bigg Boss 3 Telugu - Sakshi

బిగ్‌బాస్‌లోకి ఇంతవరకు ఓ జంట వెళ్లింది లేదు. అయితే అందులోకి వెళ్లాక జంటలు ఏర్పడటం మామూలే. అయితే ఈ సారి ఓ జంట మాత్రం హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో ఒకప్పుడు ఫుల్‌ క్రేజ్‌ను సొంతం చేసుకున్న వరుణ్‌ సందేశ్‌, ఆయన సతీమణి వితికా షెరు హౌస్‌లోకి ప్రవేశించారు. మరి ఇద్దరు భార్యభర్తలు హౌస్‌లో ఎలా ఉంటారు? టాస్క్‌లు ఇచ్చినప్పుడు ఒకరిపై ఒకరు గెలవాలనుకుంటారా? లేదా ఒకరికోసం మరొకరు వదులుకుంటారా? అన్నది చూడాలి.

వరుణ్‌ సందేశ్‌
జననం: 21 జూలై 1989
స్వస్థలం: రాయగడ, ఒరిస్సా
విద్య: ఎంబీఏ
తల్లిదండ్రులు: రమని జీడిగుంట్ల- విజయ్‌ సారధి
భార్య: వితికా షెరు
వృత్తి: నటుడు, నిర్మాత
గుర్తింపునిచ్చింది: హ్యాపీడేస్‌
ప్రయాణం: 2007లో హ్యాపీడేస్‌తో చిత్రపరిశ్రమలోకి తెరంగ్రేటం చేశాడు. తర్వాత కొత్త బంగారు లోకంతో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. కాకపోతే సినిమాల ఎంపికలో చేసిన తప్పిదాల వల్ల దాన్ని ఎక్కువకాలం నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రం కోసం గొంతు శృతి కలిపాడు.
పెళ్లి: మరో చరిత్రలో సహనటి శ్రద్దా దాస్‌తో కొంతకాలం రిలేషన్‌షిప్‌ కొనసాగించాడు. తరువాత నటి వితికా షెరుతో ప్రేమలో పడటంతో 2016 ఆగస్టు 19న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
నటించిన చిత్రాలు: కుర్రాడు, మరో చరిత్ర, ఏమైంది ఈ వేళ, చమ్మక్‌ చల్లో, డీ ఫర్‌ దోపిడీ, మామ మంచు అల్లుడు కంచు పలు చిత్రాల్లో నటించాడు.
తెలియనివి: కళాంజలి స్టోర్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు.
ఇష్టమైన నటీనటులు: షారుఖ్‌ఖాన్‌, దీపిక పదుకునే, తమన్నా

               

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top