
మా మధ్య దూరం లేదు
ఏ రంగంలో అయినా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈరోజు బద్ధశత్రువులుగా ఉన్నవారు రేపు అత్యంత ఆప్తమిత్రులుగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరంలేదు.
ఏ రంగంలో అయినా శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈరోజు బద్ధశత్రువులుగా ఉన్నవారు రేపు అత్యంత ఆప్తమిత్రులుగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరంలేదు. త్రిష, నయనతార ఈ కోవకు చెందినవారే. ఒకప్పుడు ‘ఈ ఇంటి మీద వాలిన కాకి.. ఆ ఇంటిమీద వాలకూడదు’ అన్నట్లుగా ఉండేవాళ్లు. ఇప్పుడు మాత్రం స్నేహితులైపోయారు. దీని గురించి త్రిష చెబుతూ -‘‘ఒకప్పుడు నేను, నయన్ ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉండేవాళ్లం.
మీడియాలో మా గురించి ఏవేవో వార్తలు వచ్చేవి. మా మధ్య మనస్పర్థలు ఉన్నాయని రాసేవాళ్లు. అవి వదంతులని స్పష్టం చేయడానికి కూడా మాకు టైమ్ ఉండేది కాదు. పైగా ఆ వార్తలకు మేం అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇద్దరం ఒకే సిటీలో ఉండం కాబట్టి, తరచుగా కలవడానికి కుదిరేది కాదు. దాంతో మా మధ్య చాలా దూరం ఉందనుకునేవాళ్లు. ఇక, ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెడితే మంచిది. నయన్, నేను మంచి స్నేహితులం. వీలు కుదిరినప్పుడల్లా కలుసుకుంటాం. బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటాం. మా ఇద్దరి అభిప్రాయాలూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి’’ అని చెప్పారు.