‘తొలిప్రేమ’ కలెక్షన్లు ఫస్ట్‌క్లాస్‌ | Tholi prema First Day Collections | Sakshi
Sakshi News home page

‘తొలిప్రేమ’ కలెక్షన్లు ఫస్ట్‌క్లాస్‌

Feb 11 2018 8:25 PM | Updated on Feb 11 2018 8:30 PM

Tholi prema First Day Collections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం తొలిప్రేమ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా బాగుందన్న టాక్‌ రావడంతో కలెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.13 కోట్ల షేర్‌, రూ. 9.6 కోట్ల గ్రాస్‌ సాధించినట్టు మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. అమెరికాలో గురు, శుక్రవారాల్లో రూ. 3.2 కోట్ల గ్రాస్‌ వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. కలెక్షన్లు స్థిరంగా ఉండటంతో వరుణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా తొలిప్రేమ నిలిచే అవకాశముందని విమర్శకులు భావిస్తున్నారు.

యువతను ఆకట్టుకునే ప్రేమకథ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్‌ తేజ సరసన రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. సుహాసిని, నరేష్‌, ప్రియదర్శి, హైపర్‌ ఆది ముఖ్యపాత్రలు పోషించారు. వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచమయ్యాడు. బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement